అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మద్య యుద్దం ప్రభావం ప్రపంచ దేశాలతోపాటు భారత్ పై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి గుండా రవాణా సమస్యల కారణంగా ఏర్పడిన LPG సరఫరా అంతరాయం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మన దేశంలోకూడా ఈ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఆహార సేవల రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గ్యాస్ సరఫరాలో మొదలైన సంక్షోభంతో దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, క్యాటరర్లు, వీధి వ్యాపారులను సంక్షోభంలోకి నెట్టింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారాల మూసివేతతో ఇప్పుడు ఆరంగంలో ఉద్యోగాల తొలగింపు, జీతాల కోత భయాలను పెంచుతోంది.
గ్యాస్ కొరతలేకుండా చూస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి గందరగోళంగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కిచెన్లు నడిపేందుకు అవసరమైన గ్యాస్ అందక చాలామంది ప్రతిరోజూ నానా తంటాలు పడుతున్నారు.
వ్యాపారాలపై ఒత్తిడి, చిన్న సంస్థలే ఎక్కువ నష్టపోతున్నాయి..
చిన్న చిన్న రెస్టారెంట్లు, వీధిలో తినుబండారాల వ్యాపారులు, క్యాటరర్లు, క్లౌడ్ కిచెన్లు గ్యాస్ కొరతతో తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పలు రెస్టారెంట్లు, దుకాణాలు మూతపడ్డాయి. కొన్ని హోటళ్లు తమ మెనూను తగ్గించుకున్నాయి. గ్యాస్ సంక్షోభంతో ఆహార పదార్థాల రేట్లను పెంచేశారు. రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల వ్యాపారం చేయలేకపోతే మొదట ప్రభావం కిందిస్థాయివారిపై పడుతుంది.
ఉద్యోగుల్లో భయాందోళనలు..
గ్యాసం కొరత ఇంకా చాలా కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నందుకు రెస్టారెంట్లు, హోటళ్లలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితో తమ ఉద్యోగాల కోతలు పడతాయేమోనని భయాందోళనలు పెరుగుతున్నాయి. ఫుడ్ సెక్టార్ మొత్తం లో లాభాలు, మెనూలు, పని వేళలపై ఈ కొరత ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేసేవారిని తాకింది. రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేస్తే డైలీ వైజ్ కూలీలకు ఉపాధి కల్పించలేం..వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని యజమానులు చెబుతున్నారు. అత్యధిక సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగంపై ఇప్పటికే ప్రభావం కనిపిస్తోందంటున్నారు.
►ALSO READ | యూపీలో గుడ్లపై ఎక్స్ పైరీ డేట్.. సీఎం యోగి సర్కార్ నిర్ణయం
